Samaajam

స్ఫూర్తి నిచ్చిన ‘స్ఫూర్తి ‘

కేవలం సోషల్ వర్క్ వరకు ప్రత్యేక బ్లాగు రాయమని ప్రశాంతి ఇచ్చిన సూచన మేరకు ఈ బ్లాగు మొదలుపెట్టాను. ఎప్పటినుంచో  స్ఫూర్తి ఫౌండేషన్ ను దర్శించాలని అనుకొంటూ ఉన్నాను.నగరానికి కొంచెం దూరాన వుండడం వల్ల తరచూ వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి గత శనివారం సాయంత్రం ఆ అవకాశం కలిగింది.

కేవలం నేను ఏమన్నా సాయం చేయగలిగితే చేద్దాం అని అనుకొని వెళ్ళాను కాని అంతకు మించిన ఆనుభూతికి లోనయ్యాను. చాలా మంది పిల్లలు తమ స్వచ్చమైన చిరునవ్వులతో స్వాగతం పలికారు. అంత చిన్నవయస్సులో ఏమాత్రం బిడియం లేకుండా అందరూ తమను తామే పరిచయం చేసుకొన్నారు. నాకు అనిపించింది సిగ్గు, బిడియం లాంటివి మనకు మనమే సృష్టించుకున్నవి అని. వారందరినీ కలిసిన తరువాత నాకు కొత్త ఉత్సాహం వచ్చింది.

 సహజంగా ఒక ట్రస్టును అనిపించాలంటే చాలా డబ్బు అవసరం అని కొంచెం స్ఠిరపడిన తరువాత ఆలోచిద్దాం అని అనుకొంటాం. కాని శ్రీవ్యాల్ తన తోటి వారి కోసం చేతనయింత చేయాలి అనే సదుద్దేశంతో ఆగష్టు 2006 న ముగ్గురు పిల్లలతో దీనిని ప్రారంభించారు. అప్పటినుండి దినదినాభివృద్ది చెంది ఇప్పటికి 45 మంది పిల్లలను చేరదీసింది. కేవలం పిల్లల సంఖ్య మాత్రమే కాకుండా వారి పెంపకంలో ఎక్కడా రాజీ పడకుండా నడిపిస్తున్నారు. చదువుతో పాటు ఇతర కళలలో కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు. వారి పొషణకు కావలసిన ఆహరాన్ని అందిచడంలో కూడ ఎక్కడా రాజీ పడకుండా నడిపించడం విశేషం.

ప్రస్తుతం దీనిని విస్తరించి 100 మంది పిల్లలను చేరదీయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి మనలాంటి ఎంతో మంది వ్యక్తుల సహకారం అవసరం. తీరిక సమయంలో ఒక సారి స్ఫూర్తి ని దర్శించమని పాఠకునికి మనవి. ఇది నగర శివార్లలో చర్లపల్లి వద్ద వుంది. దీని వెబ్ సైటు

www.sphoorti.org/joinus.html

ఈ ‘స్ఫూర్తి ‘ ద్వారా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు తయారవుతారని నా గట్టి నమ్మకం. వారు పెరుగుతున్న ఆరోగ్యకర వాతావరణం వల్లనే నాకీ భరోసా. నేను సైతం ‘స్ఫూర్తి ‘ అభివృద్ది కి చేతనయినంత కృషి చేయాలని నిర్ణయించుకొన్నాను.

December 12, 2007 - Posted by uravishankar | Orphanages | | 7 Comments

7 Comments »

  1. మీ నిర్ణయానికి అభినందనలు

    Comment by జాన్ హైడ్ కనుమూరి | December 13, 2007 | Reply

  2. kruthajnatalu kanumuri garu..

    Comment by Ravi Shankar | December 14, 2007 | Reply

  3. raviiii

    spoorti
    ane org name chusi
    nee article chadivi impress ayyanu

    Comment by ravikiranam | December 14, 2007 | Reply

  4. manchi uddesam..chakkati blog

    Comment by usha | December 14, 2007 | Reply

  5. Thank you Ravi and Usha,
    Please visit the place once when you come to Hyderabad!!

    Comment by uravishankar | December 14, 2007 | Reply

  6. Hi Ravi,

    After reading your blog I feel like I too should visit it. May be next year.

    Comment by Prasanthi | December 19, 2007 | Reply

  7. మీ బ్లాగ్ చూసి, ఇప్పుడె, కొంత donation పంపాను. చాలా కాలం నుండి, అనాధ పిల్లలను, మతం మార్చకుండా, పెంచే organization కు ఎంతో కొంత సాయం చేద్దాము అని అనుకొంటున్నాను. మీ బ్లాగ్ ద్వారా, స్పూర్తి గురించి తెలియచెప్పినందుకు Thanks.

    Comment by krishna | June 26, 2008 | Reply


Leave a comment